04-07-2025 12:28:19 AM
రాష్ట్రంలో కూరగాయలు, పండ్లు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలు పచ్చడి మెతుకులకే పరిమితమవుతున్నారు. రైతులు ప్రజల అవసరాలకు అనుగుణం గా ప్రభుత్వాలు కూరగాయలు, పండ్ల తోటల పెంపకాన్ని ప్రోత్సహించకపోవడంతోనే ఈ సమస్య. వర్షం, వరద నష్టం కూరగాయల సాగుపై పడింది. దిగుబడి తగ్గింది. దీంతో కూరగాయల ధరలు మండిపోతున్నాయి..
దాదాపు అన్ని రకాల కూరగాయల ధరలు సెంచరీకి చేరువలో ఉన్నాయి. సాధారణంలో ఈ సీజన్‌లో కూరగాయల ధరలు అందుబాటులో ఉండాలి.కానీ, ప్రస్తుతం బహిరంగ మార్కెట్ లో అన్ని రకాల కూరగాయాల ధరలు నలభై శాతం వరకు పెరిగాయి. టామాటాలు సగటున రూ.40 నుంచి 50 వరకు పలుకుతుండగా..
పచ్చి మిర్చి కిలోకి 70.. చిక్కుడు కిలో ౮0, బీరకాయ 80, బెండకాయ ౬0, క్యారెట్ వంద, కాకరకాయ 80, క్యాలీఫ్లవర్ 80, అకుకూరలు కట్ట 20, కొత్తిమీర, పుదీనా కట్ట ౩౦ వరకు ధర పలుకుతోంది. గతంలో మూడు వందల రూపాయల కూరగాయలు కొనుగోలు చేస్తే వారానికి సరిపడా వచ్చేవి.. ఇప్పుడు.. కనీసం రెండు రోజులకు కూడా సరిపోయే కారగాయలు రావడం లేదంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉల్లిగడ్డలు కూడా మార్కెట్‌లో అధిక ధరలే పలుకుతున్నాయి. ఈ ధరలు కొత్త దిగుబడి వచ్చే వరకూ కొనసాగుతాయని అవుతాయని వ్యాపారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు కూరగాయల ధరలు సామాన్యడికి అందుబాటులోకి వచ్చేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రభుత్వం మున్సిపల్ శాఖ, పంచాయతీల్లో సేకరించిన చెత్తతో తయారు చేసే వర్మికంపోస్ట్‌ను రైతులకు నామమాత్రపు ధరకు పంపిణీ చేయాలి. తద్వారా రైతులు తక్కువ కమతాల్లో కూరగాయలు, పండ్లు పండించేందుకు ప్రోత్సహించాలి. అలా వారికి పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది. ప్రజలకు అవసరమైన కూరగాయలు కూడా మార్కెట్‌లోకి వస్తాయి.
సింగు లక్ష్మీనారాయణ, కరీంనగర్