calender_icon.png 4 July, 2025 | 8:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సృజనాత్మక విద్య అందించాలి

04-07-2025 12:24:39 AM

ప్రభుత్వాలు నేడు అమలు చేస్తున్న విద్యావిధానం కేవలం మార్కులు, ర్యాంకుల చుట్టూ తిరుగుతోంది. ఆ విధానం విద్యార్థులపై అనవసరమైన ఒత్తిడి పెంచుతున్నదే తప్ప, వారికి నిజమైన జ్ఞానం, నైపుణ్యాలు అందించడం లేదు. వారి సమగ్ర వికాసానికి బాటలు వేయాలంటే ఆచరణాత్మక విద్య అందించాలి.

విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచే విధంగా బోధన ఉండాలి. విద్యాసంస్థలు కేవలం కంపెనీలకు ఉద్యోగులను అందించే కర్మాగారాలుగా కాకుం డా, వారిని ఎంటర్‌ప్రెన్యూర్లను చేసే విధంగా ఉంటే బాగుంటుంది. విద్యాలయాలు వ్యాపార కేంద్రాలుగా మారిన వేళ అలాంటి విద్య అందించడం కష్టతరమైనప్పటికీ..

ప్రభుత్వాలు తలుచుకుంటే, ఏడాదికి కొంచెం కొంచమైనా అమలయ్యే అవకాశం ఉంది. కనీసం ప్రభుత్వ బడుల్లోకి విస్తృతంగా సాంకేతికతను తీసుకురావాలి. ఉపాధ్యాయులు బట్టీపట్టించే విధానానికి స్వస్తి పలికి ప్రయోగాత్మకంగా పాఠాలు చెప్పాలి.

 దండంరాజు రాంచందర్ రావు, పాత బోయినపల్లి