17-01-2026 11:23:55 AM
హైదరాబాద్: సంక్రాంతి రద్దీ నివారణకు వాహనాలను దారి మళ్లించారు. ఏపీ నుంచి హైదరాబాద్(AP to Hyderabad) వచ్చే వాహనాలను దారి మళ్లిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. జాతీయ రహదారి 65పై విస్తరణ పనుల దృష్ట్యా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. చిట్యాల, పెద్దకాపర్తి, కొర్లపహాడ్, పంతంగి టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశముంది. ట్రాఫిక్ జామ్ దృష్ట్యా పోలీసులు ప్రత్యామ్యాయ మార్గాలను సూచించారు.
గుంటూరు నుంచి హైదరాబాద్(Guntur to Hyderabad) వచ్చే వాహనాలను దారి మళ్లించారు. గుంటూరు-మిర్యాలగూడ-హాలియా-చింతపల్లి- మాచర్ల- సాగర్- పెద్దవూర- చింతపల్లి- మాల్ మీదగా హైదరాబాద్ కు మళ్లిస్తున్నారు. నల్లొండ-మర్రిగూడ బైపాస్-మునుగోడు-చౌటుప్పల్ మీదకు హైదరాబాద్ కు మళ్లిస్తున్నారు. విజయవాడ నుంచి వచ్చే భారీ వాహనాలు కోదాడ- మాల్ మీదుగా హైదరాబాద్ కు మళ్లిస్తున్నారు. ఎన్ హెచ్ 65పై ట్రాఫిక్ జామ్ ఏర్పడితే చిట్యాల నుంచి భువనగిరి మీదుగా దారి మళ్లిస్తున్నారు. డ్రోన్ కెమెరాలు, సీసీ టీవీలతో ట్రాఫిక్ పరిస్థితిపై నిరంతరంగా పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.