14 May, 2026 | 3:28 AM

అమెరికా 51వ రాష్ట్రం వెనుజులా!

14-05-2026 02:23 AM

మ్యాప్‌ను విడుదల చేసిన ట్రంప్

హైదరాబాద్, మే 13: అమెరికాలోని 51వ రాష్ట్రంగా వెనుజులాను పేర్కొంటూ సోషల్ మీడియాలో ఆ రాష్ట్ర అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ మ్యాప్‌ను విడుదల చేశారు. ఈ పోస్ట్ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తమ దేశం ఎన్నటికీ అమెరికాలో భాగం కాదంటూ వెనుజులా తాత్కాలిక అధ్యక్షుడు రోడ్రిగ్స్ ప్రకటన చేసిన మరుసటి రోజే ఈ పోస్ట్ పెట్టడం గమనార్హం.

ఈ ఏడాది జనవరిలో వెనుజులాపై సైనిక చర్య చేపట్టిన అమెరికా.. ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను బందీలుగా పట్టుకున్నారు. న్యూయార్క్ కోర్టులో దోషులుగా ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి వెనుజులాను తమ అధీనంలోకి తీసుకుం టామంటూ ట్రంప్ పదేపదే ప్రకటనలు చేస్తూ వచ్చారు. తాజాగా 51వ రాష్ట్రంగా మ్యాప్ ద్వారా అమెరికా భాగంగా చూపించడం ఇందుకు నిదర్శనం. కాగా ప్రస్తుతం వెనుజులాలో తాత్కాలిక ప్రభుత్వం కొనసాగుతోంది.