03-12-2025 06:54:48 PM
శ్రీధర్ కు ఘనంగా సన్మానం..
సుల్తానాబాద్ (విజయక్రాంతి): సుల్తానాబాద్ పట్టణంలోని శాస్త్రినగర్ లో నూతనంగా నిర్మాణమైన అయ్యప్ప స్వామి దేవాలయంలో బుధవారం అయ్యప్ప స్వాములకు టాక్స్ కన్సల్టెంట్, అడ్వకేట్ వెంగళ దాసు శ్రీధర్ అన్నదానం చేశారు. అంతకు ముందు అయ్యప్ప స్వామి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ట్రస్ట్ వ్యవస్థాపకులు, చైర్మన్ సాయిరీ మహేందర్, గురు స్వామి మిట్టపల్లి మురళీధర్ లు స్వామి వారి మెమొంటో అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చీఫ్ అడ్వైజర్ కందుకూరి ప్రకాష్ రావు, ముత్యాల రవీందర్, భక్త బృందం కుమార్ కిషోర్, ఉస్తం గణేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు.