పెళ్లి పీటలెక్కిన భారత క్రికెటర్
02-06-2024 06:47 PM
టీమిండియా క్రికెటర్, కోల్ కతా నైట్ రైడర్స్ స్టార్ ఆల్ రౌండర్ వెంకటేశ్ అయ్యర్ పెళ్లి పీటలెక్కాడు. తన చిరకాల ప్రేయసి శృతి రఘనాథన్ మెడలో ఆదివారం వివాహ బంధంలోకి అడుగు పెట్టాడు. శృతి రఘునాథన్ నిఫ్ట్ లో ఫ్యాసన్ మేనేజ్ మెంట్ లో మాస్టర్స్ డిగ్రీ చేసి ప్రసుత్తం బెంగళూరులో ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. గతేడాది నవంబర్ లో వీరిద్ధరికి నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. భారత్ వేదికగా 2021లో న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ టీ20లలో అడుగుపెట్టిన వెంకీ.. ఐపిఎస్ 2024 సీజన్ టైటిల్ ను కోల్ కతా నైట్ రైడర్స్ గెలుపొందాడంలో కీలక పాత్ర పోషించాడు. భారత జట్టు తరుపున ఇప్పటి వరకు 2 వన్డే, 9 టీ20 మ్యాచ్ లు ఆడి వరుసగా 24,133 పరుగులు సాధించాడు.






