11 April, 2026 | 2:10 AM

చిత్తడి నేలగా వెంకట్రావుపేట చెరువు

11-04-2026 12:00 AM

ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశాలు

మంచిర్యాల, ఏప్రిల్ 10 (విజయక్రాంతి) : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మం డలం వెంకట్రావుపేట గ్రామంలో గల చెరువును చిత్తడి నేలగా ప్రకటించేందుకు ప్రతి పాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశాలు జారీ చేశారు.

శుక్రవారం కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా అటవీ అధికారి శివ్ ఆశిష్ సింగ్, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి. చంద్రయ్య లతో కలిసి రెవెన్యూ, మత్స్య, నీటిపారుదల, వ్యవసాయ, పర్యటక శాఖల అధికారులు, సం బంధిత అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. వెంకట్రావుపేట గ్రామంలోని చెరువు 132 ఎకరా ల విస్తీర్ణంలో వ్యాపించి ఉందని, ఈ చెరువు వలస పక్షులకు ప్రపంచ ప్రసిద్ధి పొందిందన్నారు.

వలస పక్షులు ఈ ప్రాంతానికి వచ్చి నివాసాలు ఏర్పరచుకుని ఉండ డం వలన గుర్తింపు పొందిందని, వలస పక్షులతో పాటు స్థానిక పక్షులకు ఒక సురక్షిత ఆవాస ప్రాంతాన్ని ఏర్పరిచేందుకు ఈ చెరువును చిత్తడి నేలగా ప్రకటించడానికి గ్రామ స్తులు,  నీటిపారుదల, రెవెన్యూ, మత్స్య, పర్యాటక శాఖల అధికారులకు ఎలాంటి అభ్యంతరం లేదని, చిత్తడి నేలగా ప్రకటించేందుకు అం దరు అంగీకరిస్తున్నారన్నారు.

చిత్తడి నేలగా ప్రకటించినట్లయితే కేంద్ర ప్రభుత్వ నిధులు మంజూరు చేయబడతాయని, తద్వారా ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయవచ్చన్నారు. రాష్ట్రస్థాయిలో జరిగే సమావేశానికి ముందే ప్రతిపాదనలు సమర్పించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.