25 July, 2026 | 4:54 PM

సమస్యలు పరిష్కరించాలి

31-05-2024 01:37 AM

ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిని కలిసిన న్యూగడ్డిఅన్నారం కాలనీవాసులు

ఎల్బీనగర్, మే 30 : వానకాలంలో వచ్చే వరద సమస్యను పరిష్కరించి, తమ ఇబ్బందులు తీర్చాలని గడ్డిఅన్నారం డివిజన్‌లోని న్యూగడ్డిఅన్నారం కాలనీవాసులు కోరారు. ఈ మేరకు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిని గురువారం ఆయన నివాసంలో న్యూగడ్డి అన్నా రం కాలనీవాసులు కలిశారు. తమ కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలను ఎమ్మెల్యేకు వివరించారు.

చిన్నపాటి వర్షానికే కాలనీ మొత్తం చిత్తడిగా మారుతుందన్నారు. ఐఎస్‌ఐ సదన్ నుంచి వచ్చే నూతన డ్రైన్ నిర్మాణం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని వివరించారు. నూతన డ్రైన్స్ నిర్మాణం చేపట్టాలని కోరారు. అంతనరం ఎమ్మెల్యే సుధీరెడ్డి మాట్లాడుతూ.. గతంలో ఎన్నికల కోడ్ రాకముందే నూతన డ్రైన్స్ నిర్మాణ పనులు కోసం ప్రతిపాదనలు పంపామన్నారు. అనంతరం ఎన్నికల కోడ్ రావడంతో ఆలస్యం జరిగిందన్నారు. ఎన్నికల కోడ్ ముగియాగానే నూతన బాక్స్ డ్రైన్స్ కోసం టెండర్ వేయించి వీలైనంత త్వరగా పనులు మొదలు పెడతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ భవానీ ప్రవీణ్‌కుమార్, కాలనీ అధ్యక్షులు రఘు, ప్రసాద్, రామ్మోహన్ రాజు తదితరులు పాల్గొన్నారు.