12-08-2024 07:47:54 PM
హైదరాబాద్: ఈనెల 16న భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ హైదరాబాద్‌కు రానున్నారు. రాష్ట్ర పర్యటనకు వస్తుండటంతో దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని సీఎస్ శాంతి కుమారి సోమవారం రాష్ట్ర సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.
17వ తేదీన ఉదయం ఉపరాష్ట్రపతి ఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యేంత వరకు సంబంధిత విభాగాల అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్, బందోబస్త్ చేయాలని పోలీసు శాఖను సీఎస్ ఆదేశించారు. ఈ పర్యటనలో సరిపడా వైద్య సిబ్బందితో వైద్య సౌకర్యాలు కల్పించాలని సూచించారు.
ఉపరాష్ట్రపతి ప్రయాణించే దారిలో రోడ్ల మరమ్మతు పనులు చేపట్టాలని ఆర్‌అండ్‌బీ శాఖకు ఆదేశించారు. అంతరాయం లేకుండా నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలని టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ యండిని సూచించారు. ఈ సమావేశంలో డీజీపీ జితేందర్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, జీఏడీ కార్యదర్శి రఘునందన్ రావు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.