12-08-2024 07:34:43 PM
హైదరాబాద్: నాంపల్లి టీఎన్జీవో భవన్ లో ఐకాస సోమవారం సమావేశం అయింది. ఒప్పంద, పొరుగు సేవల సిబ్బందికి జీతాలు రావట్లేదు అని టీఎన్జీవో పేర్కొంది. 317 జీవో సవరించి ఉద్యోగులకు న్యాయం చేయాలని, గచ్చిబౌలి, భాగ్యనగర్ సొసైటీ స్థలాల సమస్య పరిష్కారించాలని టీఎన్జీవో తెలిపింది. ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలవాలని, స్థానిక ఎన్నికల తర్వాత ఉద్యోగులను సొంత ప్రాంతాలకు బదిలీ చేయాలని టీఎన్జీవో వెల్లడించింది. త్వరలో ఐకాస భేటీలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని టీఎన్జీవో చెప్పింది.