calender_icon.png 20 August, 2025 | 9:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధితులకే ఫ్రెండ్లీ పోలీసింగ్..

20-08-2025 12:43:34 AM

తరిగొప్పుల,(విజయక్రాంతి): పోలీసులు బాధితులకే ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేయాలని, అక్రమార్కులకు కాదని జనగామ ఏసీపి పండేరి చేతన్ నితిన్ సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ను మంగళవారం ఆయన సందర్శించి పలు రికార్డులు సిబ్బంది కిట్టులను పరిశీలించారు.

వన మహోత్సవంలో భాగంగా పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో మొక్కలు నాటారు ఇంకుడు గుంతను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు ముందుండాలన్నారు. గంజాయి ఉక్కు పాదం మోపాలని అలాంటి వారి పట్ల కఠినంగా ఉండాలని గ్రామాల్లో ఎవరైతే గంజాయి అమ్మిన స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.