calender_icon.png 20 August, 2025 | 12:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘కాంగ్రెస్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నది’

20-08-2025 12:44:05 AM

హైదరాబాద్, ఆగస్టు 19 (విజయక్రాంతి): ‘ఓటు అధికార్ యాత్ర’ అనేది కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి చేస్తున్న మరో ప్రయత్నమని తెలంగాణ రాష్ర్ట బీజేపీ అధికార ప్రతినిధి, మీడియా ఇన్‌చార్జి ఎన్వీ సుభాష్ ఒక ప్రకటనలో విమర్శించారు.  అబద్ధపు నినాదంతో కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

బీసీలపై రేవంత్‌రెడ్డిది కపట ప్రేమ

ఉపరాష్ర్టపతి అభ్యర్థిపై సీఎంకు ఎన్వీ సుభాష్ ప్రశ్న

హైదరాబాద్, ఆగస్టు 19 (విజయక్రాంతి): బీసీలపై సీఎం రేవంత్‌రెడ్డి కపటప్రేమ చూపిస్తున్నారని బీజేపీ రాష్ర్ట అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ ఒక ప్రకటనలో విమర్శించారు.  ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ తరఫున ఉన్న ఓబీసీ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌కు వ్యతిరేకంగా ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని బరిలో నిలపడం ద్వారా వారి ద్వంద్వ వైఖరి బహిర్గతమైందన్నారు.

బీసీ లు, ఓబీసీలకు తామే న్యాయం చేశామంటూ ప్రచారం చేసుకునే సీఎం రేవం త్ రెడ్డికి బీసీలపై ఉన్నది కపట ప్రేమ అని విమర్శించారు. ఓబీసీలను కాంగ్రెస్ మోసం చేస్తూనే ఉందని చెప్పేందుకు ఇది ఉదాహరణగా అభివర్ణించారు. రేవంత్ రెడ్డి బీసీలను మరోసారి వంచించారని ఆయన ఆరోపించారు.