12-08-2025 12:00:00 AM
షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామ్‌చందర్
కాగజ్‌నగర్, ఆగస్టు 11 (విజయక్రాంతి): దళితుల భూములను ఎవరు ఆక్రమించకూ డదని, ఆక్రమణ జరిగితే సంబంధిత దళిత బాధితులు వెంటనే కమిషన్ వెబ్‌సైట్‌లో ఆన్ లైన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని షెడ్యూల్ కులముల జాతీయ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామ్‌చందర్ అన్నారు. సోమవారం జిల్లాలోని కాగజ్ నగర్ పట్టణంలో గల సంతోష్ ఫంక్షన్ హాల్ కు విచ్చేసిన కమిషన్ సభ్యులకు కాగజ్ నగర్ డి.ఎస్.పి. రామానుజం, జిల్లా షెడ్యూల్ కులాల సంక్షేమ శాఖ అధికారి సజీవన్, మండ ల తహసిల్దార్ మధుకర్ పుష్పగుచ్చాలు, మొ క్కలు అందించి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా జాతీయ కమిషన్ సభ్యులు పాత్రి కేయులతో మాట్లాడుతూ.. దళిత భూముల ఆక్రమణకు పాల్పడితే సంబంధిత బాధితులు కమిషన్ వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్ ద్వారా దళితులకు సత్వర న్యాయం జరుగుతుందని, అణగారిన వర్గాల సంక్షేమం కోసం కమిషన్ కృషి చేస్తుందని తెలిపారు.
దళిత బాధితులు అన్యాయానికి గురైన సందర్భంలో న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారని, సత్వర న్యాయం అందడం లేదని తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత డా. బి. ఆర్. అంబేద్కర్ ఆర్టికల్ 338 ద్వారా షెడ్యూల్ కులాల కమిషన్ కు విశేష అధికారాలను అందించారని, తద్వారా కనగారిన వర్గాలకు ఎలాంటి అన్యాయం జరిగిన కమిషన్ సత్వరమే స్పందించి దళితుల పక్షాన అండగా నిలుస్తుందని తెలిపారు. దళితుల భూములు ఆక్రమణకు గురైనా, ఉద్యోగ పదోన్నతులు, నియామకాల విషయంలో అన్యాయం జరిగినా, వివక్షకు గురైనా బాధితు లు జాతీయ కమిషన్‌కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.
సివిల్ న్యాయస్థానానికి ఉన్న అధికారాలు జాతీయ కమిషన్‌కు ఉంటాయని తెలిపారు. కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా నుండి భూమికి సంబంధిత ఫిర్యాదులే అధికం గా వస్తున్నాయని, ఈ ప్రాంతంలో ఎక్కువగా లావుని పట్టా భూములు ఉన్నందున ఇతరు లు ఆక్రమిస్తున్నారని,
ఈ కారణంగా సంబంధి త అణగారిన వర్గాలు కమిషన్‌ను ఆశ్రయిస్తున్నారని, ఈ విషయమై గతంలో సమీక్ష సమా వేశం నిర్వహించి జిల్లా అధికారులకు పలు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని తెలిపారు. షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్ అణగారిన వర్గాలు, దళితుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రూరల్ సి.ఐ. కుమారస్వామి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి కోట ప్రసాద్, షెడ్యూల్ కులాల సంక్షేమ వసతి గృహాల సంక్షేమ అధికారులు, ఎస్.ఐ.లు సుధాకర్, సురేష్ సంబం ధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.