calender_icon.png 12 August, 2025 | 3:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తిమ్మంపేట ప్రాథమికోన్నత పాఠశాలలో నులిపురుగు నివారణ మాత్రల పంపిణీ

12-08-2025 12:00:00 AM

 ములకలపల్లి, ఆగస్టు 11,( విజయ క్రాంతి):జాతీయ నులిపురుగు నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని తిమ్మంపేటలోని ప్రాథమికోన్నత పాఠశాల లో సోమ వారం నులిపురుగుల నివారణ మాత్రలను పంపిణీ చేశారు. పిల్లల్లో పోషకాల లోపం, రక్తహీనత సమస్యల నుండి బయటపడేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆల్బెం డజోల్ మాత్రలు పంపిణీ కార్యక్రమం విజయవంతమైంది.

పాఠశాలకు హాజరైన 72 మంది విద్యార్థినీ విద్యార్థులకు తిమ్మంపేట గ్రామ ఆరోగ్య కార్యకర్త అన్నపూర్ణ, మాత్రల ను పంపిణీ చేశారు. మాత్రలు స్వీకరించిన విద్యార్థులను మధ్యాహ్నం వరకు అబ్జర్వేషన్ లో ఉంచారు. తిమ్మంపేట ప్రాథమికొన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులుబి శంకర్ పర్యవేక్షణలో నులిపురుగుల నివారణ మా త్రలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమములో ఉపాధ్యాయులు నిర్మల, సురేష్, ప్రశాంత్, ముతేశ్వర రావు గారు పాల్గొన్నారు.