19-01-2026 12:47:36 AM
తేల్చి చెప్పేసిన ఐర్లాండ్
దుబాయి, జనవరి 18 : టీ20 ప్రపంచకప్ ఆడేందుకు భారత్ రామంటూ మొండికేస్తున్న బంగ్లాదేశ్‌కు షాక్ మీద షాక్ తగులుతోంది. ఇప్పటికే వేదిక మార్చేది లేదని ఐసీసీ పలుసార్లు స్పష్టం చేసినా కొత్త కొత్త ప్రతిపాదనలతో ముందుకొస్తున్న బంగ్లాదేశ్‌కు ఐర్లాండ్ షాకిచ్చింది. తమ గ్రూప్ మార్చి ఐర్లాండ్ ప్లేస్‌ను కేటాయించమంటూ బంగ్లా క్రికెట్ బోర్డు ప్రతిపాదనపై ఐరిష్ క్రికెట్ బోర్డు మండిపడింది. ఈ గ్రూప్ స్వా పింగ్‌కు ఒప్పుకోమని తేల్చి చెప్పింది. తమ కు ముందుగా కేటాయించిన గ్రూప్‌లోనే మ్యాచ్‌లు ఆడతామని స్పష్టం చేసింది. తమ లీగ్ మ్యాచ్‌లన్నింటినీ శ్రీలంకలోనే ఆడతామని తెలిపింది. ఈ మెగా టోర్నీలో బంగ్లాదేశ్ గ్రూప్ సిలో ఉంది. షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ తమ మ్యాచ్‌లను కోల్‌కత్తా, ముం బై వేదికలుగా ఆడాల్సి ఉంది. అయితే భద్రతా కారణాలను సాకుగా చూపిస్తూ భారత్‌కు వచ్చేది లేదని చెబుతోంది.
దీనిపై ఐసీసీ అధికారులు చర్చించగా గ్రూప్ బిలో ఉన్న ఐర్లాండ్తో తమ గ్రూప్‌ను మార్పు చేయాలని కోరింది. ఐర్లాండ్‌తో గ్రూప్ స్వాపింగ్ చేసుకుంటే లీగ్ స్టేజ్ మ్యాచ్‌లను శ్రీలంకలో ఆడొచ్చని బంగ్లాదేశ్ భావించిం ది. అయితే దీనికి ఐర్లాండ్ నో చెప్పింది. బంగ్లా ప్రతిపాదనను నిర్మొహమాటంగా తిరస్కరించింది. తాము మొదట నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే ఆడతామనీ, తమ గ్రూప్ స్టేజ్ మొత్తం శ్రీలంకలోనే జరుగుతుందని ఐర్లాండ్ క్రికెట్ బోర్డు అధికారి ఒక రు స్పష్టం చేశాడు. కాగా హిందువులపై దాడులకు నిరసనగా ఐపీఎల్ నుంచి బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ రహమాన్‌ను రిలీజ్ చేయడంతో ఈ వివాదం మొదలైంది. ఒకవేళ ప్రపంచకప్ మ్యాచ్‌లు ఆడేందుకు బం గ్లాదేశ్ భారత్‌కు రాకుంటే పాయింట్లను కోల్పోవాల్సి ఉంటుంది.