17-12-2025 01:38:23 AM
ఇబ్రహీంపట్నం /అబ్దుల్లాపూర్ మెట్/ మహేశ్వరం/కందుకూరు,డిసెంబర్ 16 (విజయక్రాంతి) : రంగారెడ్డి జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల సర్వం సిద్ధమైంది. జిల్లాలో 21 మండలాల్లో ఇప్పటికే చేవెళ్ల షాద్నగర్ కందుకూరు రెవెన్యూ డివిజన్లో 11 మొదటి 14 రెండవా విడత పోలింగ్ ముగియగా... నేడు మూడో విడత ఇబ్రహీంపట్నం రెవెన్యూ, కందుకూరు డివిజన్ లో పోలింగ్ జరగనుంది.
ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నారాయణ రెడ్డి ఎన్నికల ఏర్పాట్లు పోలింగ్ గురించి సంబంధిత అధికారులకు దిశా నిర్దేశం చేశా రు. రాచకొండ సిపి సుధీర్ బాబు ప్రత్యేకంగా ఎన్నికల్లో శాంతి భద్రతలకు ఎక్కడ విఘాతం కలవకుండా ప్రత్యేకంగా పర్యవేక్షణ చేయనున్నారు. సంబంధిత పోలీస్ అధికారులకు ఆదేశాలు జారిచేశారు. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని కందుకూ రు,
మహేశ్వరం మండలాలలో ఉన్న గ్రామ పంచాయతీల సర్పంచ్ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు మహేశ్వరం మండలంలో 28 గ్రామపంచాయతీలకు, కందుకూరు మండలంలో 32 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరిపేందుకు అధికారులు పోలింగ్ సిబ్బందిని బ్యాలెట్ పత్రాలు, బాక్సులతో పాటు సామాగ్రీని ప్రతి గ్రామపంచాయతీలకు సోమ వారం సాయంత్రం పంపించారు.
సోమవారం ఉదయం 6గంటలలోపు సర్పంచ్ అభ్యర్థులు, వార్డులకు పోటీచేసే అభ్యర్థులు రిటర్నింగ్ అధికారులకు పోలింగ్ ఏజెంట్ పత్రాలు సకాలంలో అందజేయాలని పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఎన్నికల అధికారులు స్పష్టం చేయడం జరిగింది.
ఉదయం 7 గంటల నుండి ప్రారంభం కానున్న ఎన్నికలు మధ్యాహ్నం ఒంటి గంట వరకే ముగుస్తుంది.3గంటల నుండి అభ్యర్థుల ముందు ఏజెంట్ ల ముందు పోలింగ్ సిబ్బంది కౌంటింగ్ ప్రారంభించి గెలిచిన అభ్యర్థులను ప్రకటిస్తారు. పోటీ చేస్తున్న అభ్యర్థులు వారి వారి భవితవ్యాలను బ్యాలెట్ బాక్స్ లో ఉండనుంది.
ఇబ్రహీంపట్నం డివిజన్‌లో.....
డివిజన్ పరిధిలోని నాలుగు మండలాల్లో 73 పంచాయతీల సర్పంచ్ , 694 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇబ్రహీంపట్నం మండలంలో 14 సర్పంచ్, 140 వార్డులకు.. అబ్దుల్లాపూర్మెట్ మండలం లో 13 సర్పంచ్, 129 వార్డులకు... యాచారం మండలంలో 24 సర్పంచ్, 220 వార్డులకు..
మంచాల మండలంలో 22 సర్పంచ్, 205 వార్డులకు పోలింగ్ జరుగనుంది. అబ్దుల్లాపూ రెమెట్ మండలంలోని పెగ్లిపూర్, మంచాల మండలంలోని కొర్రవాణి తండా సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. డివిజన్ పరి ధిలో 32 మంది వార్డు సభ్యులు ఏకగ్రీంగా ఎన్నికయ్యారు.
పోలీసు బందోబస్తు......
ఎన్నికల నిర్వహణకు ప్రతి పోలింగ్ కేంద్రంలో ఆర్వో, ఏఆర్వో, పోలింగ్ ఆఫీసర్, జోనల్ ఆఫీసర్లు, రూట్ ఆఫీసర్లను నియమించారు. సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద పోలీ ను బలగాలు మోహరించనున్నాయి. బ్యాలెట్ బాక్సులు, పత్రాలు, ఓటర్ జాబితా, బాక్స్లు సిల్ చేసే తదితర పోలింగ్ సామగ్రిని, సిబ్బందిని కేటాయించారు.