21 May, 2026 | 4:09 AM

అప్రమత్తతతోనే సైబర్ నేరాలకు అడ్డుకట్ట

21-04-2024 01:08 AM

ఎస్పీ అఖిల్ మహాజన్

రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): అప్రమత్తత, అవగాహ నతో సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్‌ను శనివారం ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన  రికార్డులను పరిశీలించారు. ఠాణా పరిధిలోని రౌడీ షీటర్లు, పెం డింగ్ కేసులు, సమస్యాత్మక, సున్నితమైన పోలింగ్ కేంద్రాల వివరాలు తెలుసుకున్నా రు. అనంతరం మాట్లాడుతూ.. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదులపై తక్షణమే ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని సూచించారు.

‘సైబర్’ వేధింపులకు యువకుడు బలి

నిజామాబాద్, ఏప్రిల్20 (విజయక్రాం తి): సైబర్ నేరగాళ్ల వేధింపులకు తాళలేని ఓ యువకుడు నాలుగు రోజుల క్రితం ఆత్మహత్యాయత్నం చేశాడు. మృత్యువుతో పోరా డుతూ శనివారం ప్రాణాలు వదిలాడు. ఆర్మూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మగ్గిడి గ్రామానికి చెందిన నాగరాజు (19) ఇటీవల తన మొబైల్‌లో ఒక ఆన్‌లైన్ గేమ్‌ను డౌన్‌లోడ్ చేశాడు. అప్పటి నుంచి తనకు కాల్స్ రావడం మొదలయ్యా యి. తాము సీబీఐ అధికారులమని, నాగరాజు నిషేధిత యాప్ డౌన్‌లోడ్ చేశాడని సైబర్ నేరగాళ్లు భయపెట్టారు. భారీగా నగదు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో నాగరాజు  రూ.3 వేలు ఆన్‌లైన్‌లో చెల్లించి, తనను ఇబ్బంది పెట్టొద్దని వేడుకున్నాడు. అయినా.. సైబర్ దొంగలు కనికరించలేదు. దీంతో నాగరాజు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు నాగరాజును ఓ దవాఖానకు తరలించి చికిత్స చేయిస్తుండగా శనివారం ప్రాణాలు కోల్పోయాడు. ఘటనపై ఆర్మూర్ పోలీసులు సైబర్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.