సాగర్‌లో అత్యవసర పంపింగ్ ప్రారంభం
l పది పంపుల ద్వారా నగరానికి తాగునీళ్లు
l ఏడు ఏండ్ల తర్వాత మళ్లీ పంపింగ్
l వచ్చేనెల 15న ఎల్లంపల్లిలో ఎమర్జెన్సీ పంపింగ్
l వినియోగదారులు ఆందోళన చెందవద్దు : జలమండలి
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): నాగార్జునసాగర్ జలాశయ ంలో ఎమర్జెన్సీ పంపింగ్ ప్రారంభమైంది. పది పంపుల్ని ఉన్నతాధికారుల సమీక్షంలో ఎండి సుదర్శన్‌రెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎండి మాట్లాడుతూ నాగార్జునసాగర్‌లో హైదరాబాద్ నగర తాగునీటి అవసరాల దృష్ట్యా ఎమర్జెన్సీ పంపింగ్ ప్రారంభించామన్నారు. అవసరమైతే రెండోదశ అత్యవసర పంపింగ్ చేయ డానికి సిద్ధంగా ఉన్నామన్నారు. నీటిలో తేలియడే సబ్ మెర్సబుల్ పంపుల ద్వారా నీటి సరఫరా చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. వచ్చేనెల 15న ఎల్లంపల్లి జలాశయంలో అత్యవసర పంపింగ్ ప్రారంభిస్తున్నట్లు వివరించారు.
ఆందోళన వద్దు..
తాగునీటికి ఢోకాలేనందు వల్ల జలమండలి వినియోగదారులు ఆందోళన చెందాల్సి న అవసరం లేదన్నారు. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ (గండిపేట), సింగూరు జలాశయాల్లో పుష్కలంగా నీరుందని జలమండ లి ఎండి తెలిపారు. అవసరమైతే ఈ రెండు రిజర్వాయర్ల నుంచి ఎమర్జెన్సీ పంపింగ్ ద్వారా తాగునీటిని సరఫరా చేస్తామన్నారు.
ఏడు ఏండ్ల తర్వాత పంపింగ్..
సాగర్ గరిష్టనీటిమట్టం 590అడుగులు కాగా ప్రస్తుతం 508అడుగులకు చేరింది. నీటిమట్టం డెడ్‌స్టోరేజీకి చేరుకోవడంతో ఈ ప్రభావం హైదరాబాద్‌పై పడకుండా.. ఉం డేందుకు ఏడేళ్ల తర్వాత అత్యవసర పంపింగ్ ప్రారంభించారు. చివరిసారిగా 2017లో పంపింగ్ చేశారు. సాగర్ జలాశయంలో ఎలిమినేటి ప్రాజెక్టు నుంచి పుట్టంగండి అప్రోచ్ కెనాల్ ద్వారా నీటిని లిఫ్ట్ చేసి.. అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా నీటిని సేకరిస్తున్నారు.
అక్కడ నీటిని శుద్ధి చేసి వాటిని హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. ఈ ఏడాది నగరానికి సరఫరా చేసే సామ ర్థ్యం 2,600 ఎంఎల్‌డిలకు పెంచారు. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం 175 ఎం ఎల్‌డి అదనపు నీటిని సరఫరా చేస్తున్నారు. ఈ నీటిని ప్రధానంగా బోర్‌వెల్స్ ఎండిపోయిన ప్రాంతాల్లో సరఫరా చేస్తున్నామని జలమండలి చెబుతోంది. కార్యక్రమంలో ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్(ఈడీ) డాక్టర్ ఎం. సత్యనారాయణ, టెక్నికల్ డైరెక్టర్ రవికుమార్, ప్రాజెక్టు డైరెక్టర్ సుదర్శన్, ట్రాన్స్‌మిషన్ సీజీఎం దశరథ్‌రెడ్డి పాల్గొన్నారు.






