16-01-2026 03:50:16 PM
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి(CM Revanth Reddy) కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) లేఖ రాశారు. హైదరాబాద్ మెట్రో రెండో దశ పనుల పురోగతిపై సీఎంకు లేఖ రాశారు. మెట్రో రెండో దశపై కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్(Union Minister Manohar Lal Khattar)తో చర్చించినట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మెట్రో తొలిదశను ప్రభుత్వం టేకోవర్ చేసుకోవాలని చెప్పినట్లు సూచించారు.
టేకోవర్ ఒప్పందాలు, లావాదేవీలు పూర్తి కావాలని చెప్పారన్నారు. అనంతరం రెండోదశపై(Hyderabad Metro Rail Phase-II project) కేంద్రం చర్యలు చేపడుతుందని చెప్పారని కేంద్రమంత్రి వెల్లడించారు. కేంద్రం ఇప్పటికే మెట్రో రెండో దశకు అంగీకరించినట్లు ఖట్టర్ తెలిపారని ఆయన సూచించారు. మెట్రో రెండో దశపై కమిటీ ఏర్పాటుకు నిర్ణయించారని చెప్పారని వివరించారు. కమిటీలో ఇద్దరు అధికారుల పేర్లను తెలంగాణ రాష్ట్రం వెంటనే ప్రతిపాదించారని కిషన్ రెడ్డి( Kishan Reddy) చెప్పారు. ఎల్ అండ్ టీ నుంచి మెట్రోను రాష్ట్రప్రభుత్వం సాధీనం చేసుకోవాలన్నారు. అనంతరం మెట్రో రెండో దశ ప్రతిపాదనలు కేంద్రానికి పంపాలని తెలిపారు.