16-01-2026 04:17:07 PM
మాది మాటల ప్రభుత్వం కాదు.
కమ్యూనిస్టు వందేళ్ల ఉత్సవాల్లో సీఎం.
హైదరాబాద్: ఖమ్మం జిల్లా పాలేరులో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) పర్యటించారు. పాలేరు నియోజకవర్గంలో జనవరి 18న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తారని మంత్రి పొంగులేటి తెలిపారు. సీఎం, మంత్రుల చేతులమీదుగా పలు శంకుస్థాపనలు చేయనున్నట్లు పేర్కొన్నారు. కూసుమంచిలో 100 పడకల ఆస్పత్రికి త్వరలోనే రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు. మద్దలపల్లి వద్ద కొత్త మార్కెట్ ను సీఎం ప్రారంభిస్తారని సూచించారు. కార్యకర్తలతో సీఎం రేవంత్ సమావేశం అవుతారని చెప్పారు. సీఎం సమావేశానికి రావాలని కార్పొరేషన్ పరిధిలోని కార్యకర్తలను మంత్రి పొంగులేటి ఆహ్వానించారు. ఎన్నికలప్పడే కాదు.. ప్రజలు ఎప్పుడు కష్టాల్లో ఉన్నా అప్పుడు వస్తామని ఆయన స్పష్టం చేశారు. తమది మాటల ప్రభుత్వం కాదన్నారు. కమ్యూనిస్టు పార్టీ వందేళ్ల ఉత్సవాల్లో రేవంత్ రెడ్డి పాల్గొంటారని పొంగులేటి వివరించారు.