calender_icon.png 11 January, 2026 | 10:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిజాలు నిర్భయంగా వెల్లడిస్తున్న విజయక్రాంతి

07-01-2026 01:06:57 AM

క్యాలెండర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు 

సికింద్రాబాద్, జనవరి 6 (విజయక్రాంతి): ప్రజల మన్ననలు పొందుతున్న విజయక్రాంతి దినప్రతిక.. నిజాలను నిర్భయంగా వెల్లడిస్తూ ప్రభుత్వానికి, అధికారు లకు, ప్రజలకు వారిదిగా పనిజేస్తుందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ ముద్దం నరసింహయాదవ్ కొనియాడారు. మంగళవారం ఎమ్మెల్యే మాధవరం, మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం బీఆర్‌ఎస్ కంటెస్టెడ్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, బాలానగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి, ఓల్డ్ బోయిన్‌పల్లి కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ విజయక్రాంతి క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ.. విజయక్రాంతి దినపత్రిక చైర్మన్ సీఎల్ రాజం ప్రతి రోజు అందిస్తున్న విశ్లేష ణాత్మక వార్తలు, వ్యాసాలు ప్రజలను ఆలోచింపజేస్తున్నాయని, దినపత్రిక ప్రజలకు మరింత చేరవై, మనుగడ సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విజయక్రాంతి నెట్వర్క్ ఇంచార్జ్ రాంచందర్, స్థానిక విలేకరి మాణిక్యాలరావు, నాయకులు మైపాల్రెడ్డి, హరినాథ్, బుర్రి యాదగిరి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.