13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

అంగన్వాడీల అభివృద్దికి నూతన పాలకవర్గం సహకరించాలి: సీడీపీఓ

07-01-2026 05:20 PM

మద్నూర్,(విజయ క్రాంతి): మద్నూర్ మండల కేంద్ర మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్, పాలకర్గానికి అంగన్వాడీల ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా సన్మానించారు. మద్నూర్ మండల కేంద్రంలో 9 అంగన్వాడి సెంటర్ల టీచర్లు ఈ సన్మాన సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సీడీపీఓ కళావతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సాందర్బంగా కళావతి మాట్లాడుతూ.. నూతన పంచాయితీ పాలకవర్గం అంగన్వాడీల ప్రగతికి పూర్తిగా సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఐసిడిఎస్ ప్రాజెక్టు భవన నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని ఈ సందర్భంగా వారు కోరారు. అంగన్వాడీ భవనాల నిర్మాణం కోసం నిధులు వచ్చాయని, కొన్ని సెంటర్లకు మరుగుదొడ్లు, ముత్రశాల నిర్మాణంకు నిధులు మంజూరైనట్లు ఆమె తెలిపారు.