07-01-2026 04:50:52 PM
నాయిని రాజేందర్ రెడ్డి మాస్ వార్నింగ్
హన్మకొండ,(విజయక్రాంతి): అసెంబ్లీ గౌరవ సభ కాదని,కౌరవ సభ అంటూ జనగామ జిల్లా కేంద్రంలో సర్పంచుల అభినందన సభ వేదికగా కేటీఆర్, సీఎం రేవంత్ రెడ్డి తో పాటు రాహుల్ గాంధీ పై పరుష పదజాలంతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కేటీఆర్ కు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ మాట తీరు, కవిత మహిళై ఉండి.. ఏం... పీకి కట్టలు కట్టారంటూ మాట్లాడటం చూస్తుంటే రానున్న రోజుల్లో కల్వకుంట్ల కుటుంబ బహిష్కరణ జరుగుతుందని జోస్యం చెప్పారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని సోనియా గాంధీ కాళ్లు పట్టుకున్న వాళ్లే నేడు తిడుతున్నారని ఫైర్ అయ్యారు. అసలు గాంధీ ఫ్యామిలీ గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేటీఆర్ ఎక్కడున్నాడో ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. అసలు కల్వకుంట్ల కుటుంబంలో ఉన్న వాళ్లే అతి చిల్లరగా తయారయ్యారని మండిపడ్డారు.
తాము తిట్టడంలో పీహెచ్‌డీలు చేశామని.. ఆ పని తాము మొదలు పెడితే ఆత్మహత్య చేసుకుంటారని అన్నారు. రాబోయే రోజుల్లో కేటీఆర్ వరంగల్‌కు వస్తే చెప్పులతో కొట్టిస్తానని మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికైనా కేటీఆర్ తన భాష తీరు మార్చుకోవాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హితవు పలికారు.