calender_icon.png 12 December, 2025 | 12:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల సందడి.. హోరాహోరీగా పోటీ

11-12-2025 11:36:31 AM

లక్షెట్టిపేట,విజయక్రాంతి: లక్షెట్టిపేట మండలంలోని 18 గ్రామపంచాయతీలోని 160 వార్డులో జరిగే ఎన్నికలు గురువారం ఉదయం 7:00 గంటలకు పోలింగ్ ప్రారంభమై మధ్యాహ్నం 1:00 గంట వరకు ఓటింగ్ కొనసాగనుంది. అనంతరం రెండు గంటలకు అధికారులు ఓట్ల లెక్కింపును ప్రారంభించి. సాయంత్రానికి ఫలితాలు ప్రకటించనున్నారు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్‌ నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికారులు చేశారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా సాగేందుకు సంబంధిత శాఖల సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.

ఉదయం 7:00 గంటలకు పోలింగ్ ప్రారంభమై మధ్యాహ్నం 1:00 గంట వరకు ఓటింగ్ పూర్తి అవ్వడం. అనంతరం రెండు గంటలకు అధికారులు ఓట్ల లెక్కింపును ప్రారంభించి.. ఇదే రోజు సాయంత్రానికి ఫలితాలు ప్రకటించనున్నారని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. ముఖ్యంగా కీలక గ్రామాల్లో వెబ్‌కాస్టింగ్ ఏర్పాట్లు చేసి పర్యవేక్షణను మరింత బలోపేతం చేశారు. ఈ సారి తొలి విడత ఎన్నికల్లో పోటీ గట్టిగానే ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈసారి సర్పంచ్, వార్డు అభ్యర్థుల మధ్య గట్టిగా పోటీ పడుతున్నారు. జిల్లాలవారీగా అభ్యర్థుల పూర్తి వివరాలను ఎన్నికల కమిషన్ ఇప్పటికే ప్రకటించింది. ఇప్పటికే మండలం లోని గ్రామపంచాయతీలో పోలైన ఓట్ల సంఖ్య 14026 కాగా పోలింగ్ 55.60% శాతం పూర్తయినట్టు అధికారులు వెల్లడించారు.