calender_icon.png 11 December, 2025 | 2:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంచాయతీ ఎన్నికలు.. 11 గంటల వరకు 52 శాతం పోలింగ్

11-12-2025 11:59:32 AM

హైదరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి దశలో తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్(Telangana Gram Panchayat Elections) కొనసాగుతోంది. తొలి విడతలో మొత్తం 189 మండలాల్లోని 3,834 గ్రామ పంచాయతీలలో సర్పంచ్ స్థానాలకు, 27,628 వార్డు సభ్యుల స్థానాలకు గురువారం పోలింగ్ నిర్వహిస్తున్నారు. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి తెల్లవారుజాము నుంచే పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. ఉదయం 11 గంటల వరకు 52.00 శాతం పోలింగ్(polling percentage) నమోదు అయినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం(State Election Commission) ప్రకటించింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనసాగుతోంది. 2 గంటల నుంచి ఓట్ల లెక్కిస్తారు.