09-01-2026 12:00:00 AM
శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న తాజాచిత్రం ‘విష్ణు విన్యాసం’. నూతన దర్శకుడు యదునాథ్ మారుతిరావు తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు జీ నిర్మిస్తున్నారు. నయన సారిక కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సత్య, బ్రహ్మాజీ, ప్రవీణ్, మురళీశర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేశ్, శ్రీనివాస్ వడ్లమాని, గోపరాజు రమణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. చిత్ర నిర్మాణం దాదాపు పూర్తి కావస్తుండగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఏకకాలంలో జరుగుతున్నాయి.
ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా చిత్రబృందం మ్యూజికల్ జర్నీని ప్రారంభించింది. ఇందులో భాగంగా ఫస్ట్ సింగిల్ ‘దేఖో విష్ణు విన్యాసం’ను గురువారం విడుదల చేశారు. రధన్ అందిం చిన సంగీతం, రామజోగ య్య శాస్త్రి సాహిత్యం, శ్రీకృ ష్ణ గాత్రంతో ఈ పాట రూ పుదిద్దుకుంది. ఈ చిత్రానికి సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీని అందించగా, ఏ రమణాంజనేయులు ఆర్ట్ డైరెక్టర్‌గా, కార్తికేయన్ రోహిణి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.