12 August, 2026 | 2:41 AM

ఆలేరులో విశ్వకర్మ యోజన

12-08-2026 01:19 AM

లబ్ధిదారులకు కుట్టు మిషన్ల పంపిణీ

ఆలేరు, ఆగస్టు 11: ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం కింద ఆలేరు మండలానికి చెందిన పలువురు లబ్ధిదారులకు కుట్టు మిషన్లు, టూల్కిట్లను మంగళవారం పంపిణీ చేశారు. ఆలేరు పట్టణంలోని తపాలా కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక పోస్టుమాస్టర్ సత్యనారాయణ, తపాలా సిబ్బంది లబ్ధిదారులకు కుట్టు మిషన్లను అందజేశారు. ఈ సందర్భంగా విశ్వకర్మ యోజనలో భాగంగా లబ్ధిదారులకు నైపుణ్య శిక్షణ అందించడంతో పాటు రూ.15 వేల విలువైన టూల్కిట్ సహాయాన్ని అందించినట్లు తెలిపారు.

పథకం ద్వారా మహిళలు స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికంగా ఎదగడానికి అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. కుట్టు మిషన్లు అందుకున్న లబ్ధిదారులు ఆసిఫా బేగం, శ్రీవాణి, కత్తుల మహేశ్వరి, దాసి ఉమారాణి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ సహాయాన్ని సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి ద్వారా తమ కుటుంబాలకు అండగా నిలుస్తామని వారు పేర్కొన్నారు.