24 May, 2026 | 3:07 PM

Breaking News

ఓహో రత్తమ్మ.. కోయారే కోయ్ కోయ్

31-01-2025 08:24 PM

విశ్వక్‌సేన్ యూనిక్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘లైలా’. రామ్ నారాయణ్ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఈ సినిమా నుంచి శుక్రవారం థర్డ్ సింగిల్ ‘ఓహో రత్తమ్మ’ విడుదలైంది. లియోన్ జేమ్స్ జానపద బాణీలో కంపోజ్ చేశారు. పెంచల్ దాస్ గీత సాహిత్యాన్ని అందిస్తూ మధుప్రియతో కలిసి పాడారు. సోషల్ మీడియా సెన్సేషనల్ ట్రాక్ ‘కోయారే కోయ్ కోయ్..’ చేర్చడం పాటకు మరింత అందాన్నిచ్చింది. ఈ పాటలో విశ్వక్‌సేన్ ట్రెడిషినల్ నుంచి అల్ట్రా-స్టైలిష్ వరకు వివిధ రకాల లుక్స్‌తో, ఆకాంక్ష శర్మ గ్లామర్‌తో ఆకట్టుకున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదల కానుంది.