12 March, 2026 | 10:48 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

నిర్భయంగా ఓటు వేయాలి

29-11-2025 06:49 PM

- సిద్దిపేట ఏసీపీ రవీందర్ 

- బెజ్జంకిలో ఫ్లాగ్ మార్చ్

బెజ్జంకి: పౌరులందరూ నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సిద్దిపేట ఏసీపీ రవీందర్ సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సిద్దిపేట పోలీస్ కమిషనర్ విజయకుమార్ ఆదేశానుసారం పోలీసులు శనివారం బెజ్జంకిలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ, ఎలాంటి భయాలు, ప్రలోభాలకు లొంగకుండా ప్రతిఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎన్నికల పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం, వంద శాతం పోలింగ్ సాధించే లక్ష్యంతో ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్టు చెప్పారు. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా, పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఫ్లాగ్ మార్చ్‌లో సిద్దిపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీను, బెజ్జంకి ఎస్సై సౌజన్య, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.