23 May, 2026 | 2:28 PM

Breaking News

నేరెళ్ళ బాలికల గురుకులంలో బోధనా సిబ్బంది నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం   •   ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తంగళ్ళపల్లి సర్పంచ్   •   వినియోగదారులకు చేరువగా టీజీఎన్పీడీడీసీఎల్ యాప్   •   మండుతున్న ఎండలకు నిర్మానుష్యంగా దమ్మపేట మెయిన్ రోడ్డు   •   పుణ్య నాయక్ తాండ చింతలపూడి మధ్య వాగుపై వంతెన నిర్మించండి   •   రైతుల సమస్యలపై ఎమ్మార్వో కార్యాలయం ఎదుట బీజేపీ నిరసన   •   జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన డీసీసీ అధ్యక్షులు   •   నూతన అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం   •   సహకార సంఘం ఎదుట జొన్న రైతుల నిరసన   •   తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను 30 నెలలైనా నెరవేర్చలేదు   •  

డంపింగ్ యార్డు తరలింపునకు సత్వర చర్యలు చేపట్టాలి

29-11-2025 06:50 PM

అధికారులను అదేశించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

ధర్మపురి,(విజయక్రాంతి): ధర్మపురి డంపింగ్ యార్డును తరలించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశించారు. ధర్మపురి మండల కేంద్రంలోని గోదావరి ఒడ్డున ఉన్న డంపింగ్ యార్డు సమస్యను స్థానిక నాయకులు వివరించడంతో, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెంటనే స్పందించారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో పాటు, హైదరాబాదు నుండి ప్రత్యేక రీసైక్లింగ్ నిపుణులను పిలిపించి డంపింగ్ యార్డు పరిస్థితిని పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న డంపింగ్ యార్డును పూర్తిగా తరలించే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఆధునిక రీసైక్లింగ్ యూనిట్ ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల నియమావళి ముగిసిన వెంటనే శాఖాధికారులు, ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించి, అమలు చర్యలను ఖరారు చేస్తామని స్పష్టం చేశారు.

రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని మంత్రి పేర్కొన్నారు. “పుష్కరాల ఏర్పాట్లు హడావిడిగా కాకుండా, ప్రత్యేక నిధులు కేటాయించి సమగ్రంగా పూర్తి చేస్తాం” అని తెలిపారు. అదేవిధంగా శివరేజి ప్లాంట్ ఏర్పాటు పనులు కూడా ప్రగతి దశలో ఉన్నాయన్నారు. డంపింగ్ యార్డు మార్పు, రీసైక్లింగ్ యూనిట్ ఏర్పాటు కోసం ఎంత నిధులు అవసరమైనా ప్రభుత్వం వెనుకాడదని ఈ సందర్బంగా మంత్రి స్పష్టం చేశారు. ధర్మపురిలో విద్యా, వైద్య రంగాలకు నూతన వసతులు కల్పించి సేవలు విస్తరించునున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ ప్రజలు,యువత తదితరులు పాల్గొన్నారు.