calender_icon.png 9 August, 2025 | 5:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓట్ల దొంగలకు శిక్ష తప్పదు

09-08-2025 01:34:21 AM

బీజేపీకి అనుకూలంగా ఎన్నికల సంఘం 

రాజ్యాంగ బాధ్యతలు విస్మరించి పనిచేస్తున్నది

  1. తన ఐదు ప్రశ్నలకు ఈసీ సమాధానమివ్వాలి
  2. ‘ఓట్ అధికార్’ ర్యాలీలో రాహుల్ గాంధీ
  3. ఈసీ వద్దకు కవాతుగా వెళ్లి మెమోరాండం ఇస్తాం: ఖర్గే
  4. ఓట్ల చోరీపై డిక్లరేషన్ విడుదల చేయండి: కేంద్ర ఎన్నికల సంఘం

బెంగళూరు, ఆగస్టు 8: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని మరోసారి విమర్శించారు. బెంగళూరులోని ఫ్రీడమ్ పార్క్‌లో జరిగిన ‘ఓట్ అధికార్ ర్యాలీ’లో పాల్గొన్న రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం తన బాధ్యతల్ని విస్మరిస్తోందని, రాజ్యాంగాన్ని గౌరవిం చాల్సిన సంస్థ ఇప్పడు బీజేపీకి అనుకూలంగా పనిచేస్తోందని ఆరోపించారు. ఓట్లను దొంగిలించేందుకు ఎన్నికల సంఘం సహకరిస్తోందని విమర్శించారు.

బీజేపీ, ఎన్నికల సంఘం కలిసి ఎన్నికల్లో భారీ నేరపూరిత మోసానికి పాల్పడ్డాయన్నారు. ఓట్ల దొంగలకు శిక్ష తప్పదని హెచ్చరించారు. ప్రజాస్వా మ్యాన్ని రక్షించాలంటే ప్రజలు చైతన్యంతో ఉండాలని, ఈ ఎన్నికల్లో న్యాయం నిలవాలంటే అధికార యంత్రాంగం కక్ష సాధిం పులు చేయకుండా వ్యవహరించాలంటూ రాహుల్ పేర్కొన్నారు. కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాంటి మోసాలు జరుగుతున్నాయన్నారు.

ఈ విషయంలో మీరు ఎంత తెలివిగా దాక్కున్నా, మేము మి మ్మల్ని పట్టుకుంటామన్నారు. దీనికి కొంచెం సమయం పట్టొచ్చు.. కానీ తప్పకుండా పట్టుకుంటామని ఈసీని ఉద్దేశించి పేర్కొన్నారు. ఎన్నికలు దేశ గుండె చప్పుడని, ఒక్క ఓటు దొంగతనం జరిగినా అది జనాభా గొం తును నొక్కేయడమేనని వ్యాఖ్యానించారు.

కర్ణాటకలో ఇలాంటి ఘటనలు జరిగితే, అది రాష్ట్ర ప్రజలకు మాత్రమే కాదు.. దేశ ప్రజాస్వామ్యానికి సవాల్‌గా మారుతుందన్నారు. కాగా బహిరంగ ర్యాలీలో రాహుల్ గాంధీతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీ ఎం డీకే శివకుమార్  పాల్గొన్నారు.

ఎన్నికల ప్రక్రియను కాపాడుకోవాలి: ఖర్గే

ఎన్నికలనేవి వస్తుంటాయి.. పోతుంటా యి.. కానీ మన ఎన్నికల ప్రక్రియను మా త్రం కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అభిప్రాయపడ్డారు. తన రాజకీయ జీవితం లో 12 సార్లు ఎన్నికల్లో గెలుపొందానని, 2019లో మాత్రమే ఓడిపోయానన్నారు. కాంగ్రెస్‌ను ఓడించడానికి బోగస్ ఓటింగ్ జరిగిందని తాను ఆనాడే చెప్పానని గుర్తుచేశారు. మోడీ అండ్ కో ఎన్నికల్లో గెలవలే దని, మన ప్రధాని ప్రజల మద్దతు లేని నా యకుడన్నారు. సోమవారం అందరం ఎం పీలు కలిసి ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు కవాతుగా వెళ్లి మెమోరాండం సమర్పించనున్నట్టు తెలిపారు.

ఓట్ల చోరీపై డిక్లరేషన్ విడుదల చేయాలి: ఈసీ

ఓట్ల చోరీ జరిగిందంటూ సంచలన ఆరోపణలు చేసిన రాహుల్ గాంధీకి ఎన్నికల సం ఘం తాజాగా సవాల్ విసిరింది. రాహుల్ ఆరోపణలను ప్రస్తావిస్తూ ఒక డిక్లరేషన్‌పై సంతకం చేసి విడుదల చేయాలని.. లేని పక్షంలో బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని ఈసీ సూచించింది. రాహుల్ ఆరోప ణలు నిరాధారమని, తప్పుదారి పట్టించేలా ఉన్నాయని ఈసీ పేర్కొంది. డిక్లరేషన్ విడుదల చేయకపోతే రాహుల్ గాంధీకి తన వ్యాఖ్యలపై నమ్మకం లేనట్టు భావించాల్సి వస్తుందని తెలిపింది.

తప్పుడు సమాచారంతో పౌరులను తప్పుదారి పట్టించినం దు కు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని కోరింది. బీహార్‌లో 65 లక్షల ఓట్లను తొలగిస్తున్నామని తాము ఆగస్టు 1న ప్రకటన విడుదల చేసినా.. మార్పులు చేర్పులపై ఇప్పటివరకు ఏ పార్టీ తమను సంప్రదించలేదని ఈసీ స్పష్టం చేసింది. తాము విడుదల చేసిన ఓట్ల తొలగింపు ముసాయిదాపై తమ అ భ్యంతరాలను రాహుల్ ఇప్పుడు కాకుండా ఎప్పటిలాగే బీహార్ ఎన్నికలు పూర్తయ్యాక మాత్రమే ఇస్తారేమోనని ఈసీ వ్యంగ్యాస్త్రాలు విసిరింది.

ఎన్నికల సంఘానికి ఐదు ప్రశ్నలు

కేంద్ర ఎన్నికల సంఘానికి రాహుల్ గాంధీ తన ‘ఎక్స్’ వేదికగా ఐదు ప్రశ్నలు సంధించారు. 

* డిజిటల్ ఓటర్ల జాబితాను ఎందుకు దాచి పెడుతున్నారు?

* సీసీ పుటేజీని ఎవరి ఆదేశాలతో ఎందుకు తొలగిస్తున్నారు?

* నకిలీ ఓట్ల నమోదును ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు?

* విపక్షాలను ఈసీ ఎందుకు భయపెడుతోంది?

* బీజేపీ ఏజెంట్‌గా ఈసీ మారిపోయిందా? 

- వెంటనే ఈ ప్రశ్నలకు ఈసీ స మాధానం చెప్పాలని డిమాండ్ చేశా రు. భారత ప్రజాస్వామ్యం ఎంతో అ మూల్యమైందని, రాజ్యాంగంపై దా డి చేసేటప్పుడు ఎన్నికల అధికారు లు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని రాహుల్ సూచించారు.