calender_icon.png 27 November, 2025 | 11:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేచి ఉండండి.. నేనే కాల్ చేస్తా!

27-11-2025 01:02:06 AM

- డీకే శివకుమార్‌కు రాహుల్ గాంధీ సందేశం

- కర్ణాటకలో నాయకత్వ మార్పుపై జోరుగా ఊహాగానాలు

-డిసెంబర్ 1లోపు అధిష్ఠానం నిర్ణయం?

బెంగళూరు, నవంబర్ 26: కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవి అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అధిష్ఠానం నిర్ణయమే అంతిమమని చెబుతున్నప్పటికీ, ఆ పదవిని దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమయంలో డీకే శివకుమార్‌కు  రాహుల్ గాంధీ పంపిన సందేశం ఆసక్తి కర చర్చకు దారితీసింది.

రాహుల్ గాంధీ విదేశాల్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి మార్పుపై ఊహాగానాలు ఎక్కువయ్యాయి. డీకే శివకుమార్ కూడా ఈ విషయంపై రాహుల్ గాంధీ తో నేరుగా మాట్లాడేందుకు ప్రయత్నించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ‘వేచి ఉండండి. నేను మీకు కాల్ చేస్తాను’ అని రాహుల్ గాంధీ ఆయనకు సందేశం పంపినట్టుగా వార్తలు వచ్చాయి.

సోనియాను కలిసేందుకు ఢిల్లీకి డీకే..?

సిద్ధరామయ్య పూర్తికాలం ముఖ్యమంత్రి గా కొనసాగుతారని డీకే శివకుమార్ చెబుతున్నప్పటికీ, ఆయన ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మరోసారి ఆయన ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధమైనట్లు సమాచారం. సోనియా గాంధీని కలిసేందుకు ఆయ న ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటకలో నాయకత్వ మార్పుపై ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు ఈ ప్రచారాన్ని ఖండించారు.

ఈ ఊహాగానాలకు ము గింపు పలకాలని సీఎం సిద్ధరామయ్య కూడా ఢిల్లీ పెద్దలకు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 1వ తేదీలోపు అధిష్ఠానం ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుంటు ందని తెలుస్తోంది. ఈ అంశంపై చర్చించేందు కు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ త్వరలో సమావేశం కానున్నారని సమాచారం.