calender_icon.png 27 November, 2025 | 9:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

41 మంది మావోయిస్టుల లొంగుబాటు

27-11-2025 01:03:58 AM

-ఛత్తీస్‌గఢ్ బీజాపూర్‌లో ఘటన

చర్ల, నవంబర్ 26 (విజయక్రాంతి): ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో బుధవా రం 41 మంది మావోయిస్టులు బీజాపూర్ ఎస్పీ డాక్టర్ జితేంద్ర కుమార్ యాదవ్ ఎదు ట ఎదుట లొంగిపోయారు. వీరిలో 12 మంది మహిళలు, 29 మంది పురుషులు ఉన్నారు. దక్షిణ సబ్-జోనల్ బ్యూరో నుంచి 39 మంది మావోయిస్టులు ఉన్నారు.

డీకేఎస్ జెడ్‌సితో పాటు, తెలంగాణ రాష్ట్ర కమిటీ, ధమ్తారి- గరియాబంద్ -నువాపాడ్ డివిజన్‌కు చెందిన మావోయిస్టులు ఉన్నారు. అంతేకాకుండా వారిలో హిడ్మా ప్రధాన అనుచరులు కూడా ఉన్నారు. వీరిపై ఉన్న రూ.1.19 కోట్ల రివార్డు ఉన్నది. కాగా జనవరి నుంచి ఇప్పటివరకు 528 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. 560 మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిపోయారు.