ఇంద్రమ్మ చీరల పంపిణీ
06-08-2026 01:14 PM
- బోధన్, ఆగస్టు 06 (విజయ క్రాంతి): తెలంగాణ ప్రభుత్వం మహిళా శక్తి సంఘాల సభ్యుల కోసం అందించిన ఇంద్రమ్మ చీరలను బోధన్ పట్టణం 14వ వార్డులో మున్సిపల్ చైర్‌పర్సన్ తూము పద్మా శరత్ రెడ్డి, జ్యోతి చిరంజీవి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహిళా శక్తి సంఘాల సభ్యులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మహిళల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో ప్రజాప్రతినిధులు నిరంతరం కృషి చేస్తున్నారని నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు దాము, జిల్లా ఉపాధ్యక్షుడు పాషా మైనుద్దీన్, ఆదినారాయణ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






