11-07-2025 12:19:02 AM
పట్టించుకోని మైనింగ్, టిఎస్‌ఎండిసి అధికారులు ఆగ్రహం చేస్తున్న ప్రజల
మంథని, జూలై10(విజయక్రాంతి) వామ్మో లారీలుఒకటి కాదు... రెండు కాదు... మంథని టూ ఖమ్మంపల్లి ప్రధాన రహదారిపై ప్రమాదకరంగా వందల కొద్ది లారీలు నిలిపివేయడంతో, ప్రధాన రహదారిపై ప్రయాణించాలంటే ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పోవాల్సిందే, ముత్తారం మండలంలోని ఖమ్మంపల్లి గ్రామపంచాయతీ లోని సందరేళ్లి మానేరు ఒడ్డున ఇసుక రీచ్ ఉండడంతో గత వారం రోజులుగా వందల కొద్ది లారీలు వస్తున్నాయి.
లారీలను క్ర మబద్ధీంచవలసిన అధికారులు, ఇసుక రిచ్ కాంట్రాక్టర్లుతమకు ఏమి సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తుండడతో లారీలను డ్రైవర్లు ఇష్టం వచ్చినట్టు ప్రధాన రహదారి పైనే పార్కింగ్ చేస్తున్నారు. దీంతో ఎదురు ఎదురుగా వస్తున్న బైకులు, కార్లు, ఆర్టీసీ బస్సు లు ఇతర వాహనాలు కనిపించక పోవడంతో వాహనాలపై వచ్చేవారు ప్రమాదానికి గురవుతున్నారు.
గురువారం మంథని మండలం రచ్చపల్లి వద్ద బైక్ పై వస్తున్న వ్యక్తిని ఖమ్మంపల్లి రీచ్ నుంచి వస్తున్న ఇసుక లారీ ఢీకొట్టడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ప్రజలు భయందోలన చెందుతున్నారు. ఖమ్మంపల్లి, సీతంపేట ధర్మారం, బిట్టుపల్లి, తాడిచెర్ల గ్రామాల నుంచి ప్రజలు బైకులపై కార్లలో మంథనికి వెళ్లి ఇంటికి రావాలంటే ప్రాణాలకు రక్షణ లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సంబంధిత జిల్లా కలెక్టర్ కానీ మైనింగ్, టిఎస్‌ఎండిసి అధికారులు ఖమ్మంపల్లి ఇసుక రిచ్ వైపు కన్నేత్తి చూడకపోవడంతో లారీలు జాతర లాగా కనబడుతున్నాయని ప్రజలు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పెద్ద ప్రమాదం జరగకముందే, జిల్లా కలెక్టర్, మైనింగ్ డిఎస్‌ఎండిసి అధికారులు, పోలీసులు వెంటనే స్పందించి ప్రమాదాలు జరగకుండా లారీలను క్రమబద్ధకరించాలని ప్రజలు కోరుతున్నారు.