calender_icon.png 11 July, 2025 | 8:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మీటర్ పట్టి కొలిచి.. చూపిస్తున్నా చూడు..

11-07-2025 12:18:21 AM

- అభివృద్ధి చేయకుండా అర్థంపర్థం మాటలు వద్దు 

- నేతలుఎవరున్నా 50 ఫీట్ల పొడవు రోడ్డు విస్తరణ 

- విలేకరుల సమావేశంలో రోడ్డు విస్తరణ కొలిచిన

- మాజీ మంత్రి డాక్టర్ సీ లక్ష్మారెడ్డి 

మహబూబ్ నగర్ జూలై 10 (విజయ క్రాంతి) : అదృష్టం కొద్దీ ఎమ్మెల్యేగా గెలిచావు... చేతనైనంత ప్రజలకు మంచి చేయి. అది కూడా చేతకాకుంటే మమ్మల్ని అడుగు అభివృద్ధి ఎలా చేయాలో చూపిస్తాం అంతేకానీ అర్థం అర్థం లేని మాటలు మాట్లాడి జడ్చర్ల కు చెడ్డ పేరు తీసుకు రాకూడదని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డిని మాజీ మంత్రి డాక్టర్ సీ లక్ష్మారెడ్డి ప్రశ్నించారు. గురువారం జడ్చర్ల లోని సిగ్నల్ గడ్డ దగ్గర బీఆర్‌ఎస్ నేతలు ఉన్న ఇండ్ల దగ్గర రోడ్డు విస్తరణ తక్కువ చేశారని ఎమ్మెల్యే ఆరోపణలు పరిగణలోకి తీసుకున్నామని, అందులో భాగంగానే బిఆర్‌ఎస్ నేతలు ఇంట్లో దగ్గర రోడ్డును కొలుస్తున్నానని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు.

పార్టీలు ఎవరు ఉన్నా ఏ పార్టీ అయినా నిబంధనలను అందరికీ సమానంగా ముందుకు తీసుకుపోవడం జరిగిందని పేర్కొన్నారు. 50 ఫీట్ల కాదు మరో మూడు ఫీట్లు అధికంగా రోడ్డు విస్తరణ ఉందని తెలిపారు. పాత బజారుకు రోడ్డు భాజప్తగా ఉందని ఇందులో ఎలాంటి సందేహం లేదని తెలిపారు. ఆంధ్రులు కాంట్రాక్టర్లు చేస్తున్నారని ఆరోపిస్తున్న ఎమ్మెల్యే బాలనగర్ నుంచి గంగపూర్ వరకు గత ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన ఈ రోడ్డు కు ఈ ప్రభుత్వ హయాంలో టెం డర్లు దక్కించుకున్న ఆంధ్రులకు పనులు ఎందుకు అప్పగించడం జరిగిందని ప్రశ్నించారు.

ఆంధ్రప్రదేశ్ కు చెందినవారు వివిధ కాంట్రాక్టు పనులు చేస్తున్నారని ఆ బిల్లులను నువ్వు ముందు ఆపి రాష్ట్రవ్యాప్తంగా ఆపాలని పిలుపునివ్వాలని సూచించారు. ఏదో గాబరా గాబరుగా మాట్లాడి నన్ను దేశమంతా గుర్తుపడతారు అబిడ్స్ లో నడుచుకుంటూ పోతే ఎవరిని గుర్తుపడతారు అని పిచ్చి ప్రశ్నలు వేయడం సమంజసం కాదన్నారు. రంగారెడ్డిగూడెం ఎండోమెంట్ ల్యాండ్ కు సంబంధించి శ్వేతా పత్రం విడుదల చేయాలని, పోలేపల్లి సిజ్జి నుంచి నా ఖాతాలో డబ్బులు పడ్డాయని విషయాన్ని రుజువు చేయాలని, మా అక్క పేరిట ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర రెండు ఎకరాల భూమి ఉందని చెప్పావు అది ఎక్కడ ఉందో పత్రం చూపించాలన్నారు.

కేవలం 10 గుంటల భూమి మాత్రమే మా అక్క పేరిట ఉందని ఆ విషయం కూడా కోర్టు పరిధిలో ఉందని తెలిపారు. నేను వేసిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని మాయమాటలు చెప్పి తప్పించుకోవడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ నేతలు ఉన్నారు.