11-07-2025 12:20:14 AM
- బిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరిక
- పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి
ముసాపేట, జూలై 10 : కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తూ అండగా ఉంటున్న అంశలను పరిగణలోకి తీసుకుంటూ టిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరుతున్నామని పలువురు నేతలు స్పష్టం చేశారు. ఈ మేరకు మూసాపేట్ మండల పరిధిలోని అ చ్చయ్య పల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, బిఆర్‌ఎస్ పార్టీ ముఖ్య నాయకులు బోయిని చంద్రశేఖర్, మూసాపేట్ మండలం పలు గ్రామాలకు చెందిన వందలాది మంది బిఆర్‌ఎస్ కా ర్యకర్తలు బిఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేసి, కాంగ్రెస్ పార్టీలో చేరారు.
పార్టీలో చేరిన వారికి దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సం దర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చెప్పింది చేస్తున్నాం చేసేది చెబుతున్నాం.. ప్రజలకు మాయమాటలు చెప్పి ముందుకు సాగడం లేదని వాస్తవాలను వివరిస్తూ అభివృద్ధి చేస్తున్నామని తెలి పారు. చేస్తున్న అభివృద్ధిని చూసి టిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి కార్యకర్తలు రావడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కుసుమ కుమార్, తదితరులు ఉన్నారు.