03-11-2025 04:08:37 PM
జిల్లా కార్యదర్శి ముద్దాభిక్షానికి రాజీనామా అందజేత
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు వాంకుడోత్ అజయ్ ఏలియస్ బికోజి సోమవారం పార్టీ సభ్యత్వానికి, కమిటీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ముద్దా బిక్షానికి పాల్వంచలో అందజేశారు. గ్రామం గుండాల, మండలం గుండాల, జిల్లా భద్రాద్రి కొత్తగూడెం 2007 సంవత్సరం నుండి ఉమ్మడి సిపిఐ( ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీలో పార్టీ నిర్ణయించిన నిర్మాణానికి లోబడి ముకుందాపురం ఏరియాలో, ఇల్లందు మండలంలోని పోలారం ఏరియాలో పనిచేశాననీ.
2022 సంవత్సరంలో పార్టీ చీలిపోయిన తర్వాత సిపిఐ ( ఎంఎల్) మాస్ లైన్ సిద్ధాంతాలకు ఆకర్షితులను మాస్ లైన్ లో పని చేశానని. 2022 నుంచి 2023 వరకు పోలారం ఏరియాలోని, 2024 నుంచి గుండాల మండలంలోని పనిచేస్తూ, పివైఎల్ రాష్ట్ర కార్యదర్శిగా, పార్టీ జిల్లా కమిటీ సభ్యుడుగా పార్టీ అప్పగించిన బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చానన్నారు. గత కొంతకాలంగా నా ఆరోగ్య, కుటుంబ, ఆర్థిక సమస్యల నేపథ్యంలో పార్టీ కార్యక్రమాలను నిర్వహించలేక పోతున్నాను. కావున పార్టీ సభ్యత్వానికి ,జిల్లా కమిటీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటనలు తెలిపారు. ఇంత కాలం పార్టీ నాయకత్వం నాపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలియజేశారు. తన రాజీనామాను ఆమోదించవలసినదిగా విజ్ఞప్తి చేశారు.