వక్ఫ్ బిల్లుపై జేపీసీలో వార్
24-08-2024 12:44 AM
న్యూఢిల్లీ, ఆగస్టు 23: వివాదాస్ప ద వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై జేపీసీలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడీ వేడి చర్చ జరుగుతున్న ట్టు తెలిసింది. అ బిల్లును జేపీసీ గురువారం నుంచి పరిశీలించటం మొద లుపెట్టింది. ఈ సందర్భంగా బిల్లు తేవటం వెనుక ప్రభుత్వ అసలు ఉద్దే శం ఏమిటో చెప్పాలని పట్టుబట్టినట్లు సమాచారం. ‘ఈ బిల్లు అసలు ఉద్దే శం ఏమిటి? చట్టానికి ఇంత భారీగా సవరణలు ఎందుకు ప్రతిపాదించా రు?’ అని నిలదీసినట్టు తెలిసింది.






