5 April, 2026 | 9:03 PM

డ్రైనేజిలు శుభ్రం చేసిన సామజిక కార్యకర్త ఏనుగు వెంకట రెడ్డి

05-04-2026 04:22 PM

మల్లాపూర్,(విజయక్రాంతి): మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన సామాజిక కార్యకర్త ఏనుగు వెంకట రెడ్డి గత రెండు రోజులుగా మల్లాపూర్‌లోని 14వ వార్డు పరిసరాల్లో డ్రైనేజీలను శుభ్రం చేస్తూ ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ సందర్భంగా వెంకట రెడ్డి మాట్లాడుతూ... ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా చేసి చెత్త కుండీల్లో వేయాలని సూచించారు. అలాగే ఎండల తీవ్రత పెరుగుతున్న ఈ సమయంలో అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదని, బయటకు వెళ్లాల్సి వస్తే తలపై హెల్మెట్ లేదా టోపీ ధరించాలని చెప్పారు. శీతల పానీయాల బదులు నిమ్మరసం వంటి సహజ పానీయాలు తీసుకోవాలని సూచించారు. వెంకట రెడ్డి చేస్తున్న ఈ సేవలను స్థానికులు ప్రశంసిస్తూ అభినందనలు తెలిపారు.