24 June, 2026 | 3:05 AM

ఏపీ తరహాలోనే ఇక్కడా ఓపీఎస్ వర్తింపజేయాలి

24-06-2026 02:02 AM

రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ 

హైదరాబాద్, జూన్ 23 (విజయక్రాంతి): సెప్టెంబర్ 1, 2004 కంటే ముందు నోటిఫికేషన్ విడుదలై, ఆ తర్వాత నియామకమైన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) వర్తింపజేస్తూ ఏపీ క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టీఎఫ్) స్వాగతించింది.

ఉమ్మడి రాష్ట్రంలో ఒకే నోటిఫికేషన్, ఒకే ప్రక్రియ ద్వారా ఎంపికైన ఉద్యోగ, ఉపాధ్యాయులు తెలంగాణలోనూ ఉన్నారని, వారికి కూడా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో సుమారు 9వేల మంది వరకు ఉంటారని, వారికి న్యాయం చేయాలని రాష్ట్ర అధ్యక్షులు కటకం రమేష్, ప్రధాన కార్యదర్శి మారెడ్డి అంజిరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు.