15-07-2025 01:01:39 AM
చౌటుప్పల్, జూలై 14 (విజయ క్రాంతి):భారతీయ జనతా పార్టీ చౌటుప్పల మున్సిపల్ మరియు రూరల్ ఆధ్వర్యంలో ఈరోజు బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచంద్ర రావు రాష్ట్ర శాఖ అధ్యక్షులు అయిన సందర్భంగా తొలి పర్యటన లో భాగంగా నల్లగొండ జిల్లా కు వెళ్ళుచున్న సందర్భంగా చౌటుప్పల పట్టణ అధ్యక్షురాలు కడారి కల్పన ఐలయ్య యాదవ్ మరియు రూరల్ అధ్యక్షులు కైరంకొండ అశోక్ రాష్ట్ర అధ్యక్షులకు వీర తిలకం దిద్ది ఘన స్వాగతం పలికారు.
అలాగే బిజెపి రాష్ట్ర అధ్యక్షునికి గజమాలతో శాలువాతో సత్కరించారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు మాట్లాడుతూ కార్యకర్తలకు ఏ ఆపద వచ్చిన నేనున్నా అనే విధంగా హామీ ఇచ్చి... తెలంగాణలో భాజపా ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కార్యకర్తలు విజయ సంకల్పం తీసుకోవాలని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని విమర్శించారు.
భాజపా ప్రభుత్వం మాత్రమే తెలంగాణలో స్వర్ణ యుగం తెస్తుంది అని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల పేరుతో అమలు కానీ హామీలు ఇచ్చి తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజలను మోసం చేసింది. కావున తదుపరి తెలంగాణలో బిజెపి ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు చేస్తుంది అని అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షులు శ్రీ గంగిడి మనోహర్ రెడ్డి ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ,
ఎమ్మెల్సీ చిన్న మైల్ అంజిరెడ్డి , మాజీ పార్లమెంట్ సభ్యులు బూర నర్సయ్య గౌడ్ ,మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి , యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు సివెల్ల మహేందర్ , యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు ఉట్కూరి అశోక్ గౌడ్ , దోనూరి వీరారెడ్డి ,పాశం భాస్కర్ దూడల భిక్షం గౌడ్, రమణ గోని శంకర్ , కంచర్ల గోవర్ధన్ రెడ్డి , భాను ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.