15-07-2025 01:02:58 AM
- ప్రజావాణికి హాజరుకాని జీహెచ్‌ఎంసీ కమిషనర్
- కుర్చీకి కొబ్బరికాయ కొట్టి, మొక్కిన కార్పొరేటర్ శ్రవణ్
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 14 (విజయక్రాంతి): జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాల యంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి కమిషనర్ కర్ణన్ హాజరుకాలేదు. దీంతో మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్.. కమిషనర్ ఖాళీ కుర్చీకి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టి, నిరసన వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం సర్కిల్ ఆఫీసు కు వెళ్తే డిప్యూటీ కమిషనర్ లేరని, జోనల్ కమిషనర్ దగ్గరకు వెళ్తే ఆయనా లేరని, నేరుగా కమి షనర్‌ను కలుద్దామని ప్రజావాణికి వస్తే కమిషనర్ కూడా లేరని శ్రవణ్ చెప్పారు.
అందుకే, ఆయన కుర్చీకి కొబ్బరికాయ కొట్టి నిరసన తెలిపాను అని ఆవేదన వ్యక్తం చేశారు. మాన్‌సూన్ పనులను హైడ్రాకు అప్పగిస్తే జీహెఎంసీ అధికారులు ఏం చేస్తారని ఆయన ప్రశ్నించారు. బో నాలు, వినాయక చవితి, బతుకమ్మ పండుగల కు సంబంధించిన నిధుల శాంక్షన్లు ఇవ్వడం లే దని, కీలకమైన బోనాల పండుగ ముందు డి ప్యూటీ కమిషనర్లను బదిలీ చేయాల్సిన అవస రం ఏమొచ్చిందని నిలదీశారు. అభివృద్ధి పను ల ఫైళ్లు కదలడం లేదని, అధికారులు అందుబాటులో ఉండటం లేదని ఆరోపించారు.