15-07-2025 01:01:17 AM
తెలంగాణ కమ్మ రాజకీయ ఐక్యవేదిక వైస్ ప్రెసిడెంట్ వీవీఎస్‌ఎన్ చౌదరి
హైదారాబాద్ సిటీ బ్యూరో, జూలై 14 (విజయక్రాంతి): ప్రజాస్వామ్యంలో దాడులు సరికాదని తెలంగాణ కమ్మ రాజకీయ ఐక్య వేదిక వైస్ ప్రెసిడెంట్ వీవీఎస్‌ఎన్ చౌదరి పేర్కొన్నారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత అనుచరుల దాడిని ఆయన ఖండించారు.
అదే సమయంలో ఎమ్మెల్సీ కవితపై తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు సరికాదు అని అన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఇద్దరూ తెలంగాణ వాదులు.. ఇద్దరూ ఎమ్మెల్సీలే ఇలాంటి చర్యలకు పాల్పడితే.. సామాన్య ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారని ప్రశ్నించారు. వీరి చర్యల కారణంగా ప్రజలు, పోలీసులు ఇబ్బంది పడ్డారని పేర్కొన్నారు. చిన్న చిన్న విషయాలను పెద్దదిగా చేసి పరిపాలన కొనసాగించకుండా చేస్తున్న కుట్రగా భావించాల్సి వస్తుందని చెప్పారు.