calender_icon.png 20 August, 2025 | 9:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంగనాల ప్రాజెక్టుకు జలకళ

20-08-2025 12:00:00 AM

ఎస్సారెస్పీవరదనీరు చేరడంతో ఆయకట్టు రైతుల్లో ఆనందం

కోరుట్ల:ఆగస్టు 19 (విజయక్రాంతి) జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని గోదావరి నదికి ఎగువన ఎస్సారెస్పీ నుండి భారిగా వరదనీరు రావటం తో గంగనాల అయకట్టు జల కళ సంచరించుకుంది. మంగళవారం గోదావరి నది జగిత్యాల జిల్లా ఇబ్రహింపట్నం మండలం లోని కోమటీకోండాపుర్, ఎర్దండి, ములరాంపుర్ నుండి బారిగా వరదనీరు వేములకుర్తి గంగనాల ప్రాజెక్టుకు భారిగా వరదనీరురావడం తో కళకళలాడుతూ ఉంది.

9 గ్రామాలలోని గంగనాల అయకట్టు ద్వారా 4 వేల ఎకరాల సాగుకు సానుకూలంగా మారింది.గోదావరి జలాలతో బీడు భూముల ను సస్యశ్యామలం చేయాలనే సంకల్పంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టును పూ ర్వం1959లో జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తి గ్రామ శివారులోని గోదావరి నదిపైన సుమారు రెండు మీటర్ల వెడల్పు, 2.5 మీటర్ల ఎత్తుతో అడ్డుగోడ (మత్తడి)ని నిర్మించారు.

ఇబ్రహింపట్నం మండలం లోనీ వేములకుర్తి, యామపుర్, ఫకిర్ కోండపుర్,మల్లపుర్ మండలం లోనీ నడీకుడ మెగిలిపెట్, ఓబులపుర్,సంగెం శ్రీరాంపూర్, ధాం రాజ్ పెల్లి వా ల్గోండ అయకట్టుకు నీరు అందు తోంది దాదాపు 2500 హెక్టార్ల వ్యవసాయ భూమికి సాగునీరు అందించే లక్ష్యంతో ఈ నీటిపారుదల పథకానికి రూపకల్పన చేశారు. నిరంతరం నిం డుకుండలా తొణికిస లాడుతూ ఆయ కట్టు రైతుల పాలిట కల్పతరువుగా ఉండి ప్రాజెక్టు ప్రసిద్ధిగాంచింది.

ప్రస్తుతం వర్షపాతం ఎక్కువగా నమోదు కావటం తో ఎగువన దాదాపు 3 లక్షల క్యూసెక్కుల నీటీనీ గోదావరి నదికీ నీరు వదలటం తో నదితీ రానీకీ బారీగ నీరు వచ్చింది.నీరు స్టోరెజీ లేక పోవటం తో దిగువకు నీరు పోయి గోదావరీ నదిలోకీ చేరుతుంది. గోదావరి ఉధృత ప్రవాహంతో వరదనీటి చేరికతో నిండు కుండను తలపిస్తుంది. ఖరీఫ్ ,రభి సాగుకు పంటలు పండేలా నీరు రావటం తో రైతులు ఆనందోత్సాహంలోఉన్నారు గంగనాల ప్రాజెక్టు అయకట్టు ను సందర్శన కోసం అయా గ్రామల ప్రజలు తండోపతండాలుగా వీక్షించడానికి వస్తున్నారు.