calender_icon.png 9 December, 2025 | 3:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

24 నుంచి వారబందీ ప్రకారం నీటి విడుదల

09-12-2025 12:00:00 AM

నిజామాబాద్, డిసెంబర్ 8 (విజయక్రాంతి): శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వారా యాసంగి పంటలకు ప్రణాళిక సిద్ధం చేసినట్టు ఎస్సీ జగదీష్ తెలిపారు. నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో  జరిగిన ఎస్సీ ఐడబ్ల్యూ ఎ ఎమ్ కమిటీ నిర్ణయించిన ప్రకారం ఈ నెల 24 నుండి ఉదయం 10 గంటలకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుండి కాకతీయ సరస్వతి లక్ష్మీ కాలువల ద్వారా ఈ సంవత్సరం యాసంగి పంటకు సాగునీటి నీ విడుదల చేయనున్నట్టు ఆయన తెలిపారు. ఎస్సీ ఐ డబ్ల్యూ కమిటీ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టుకు వారబంధి పద్ధతిలో సాగునీటి విడుదల కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. సాగునీరు వృధా కాకుండా పొదుపుగా వాడుకోవాలని రైతంగానికి ఆయన విజ్ఞప్తి చేశారు.