6 August, 2026 | 12:36 PM

కొనరావుపేట కొండ చెరువుకు నీటి విడుదల

06-08-2026 12:03 PM

కాలువ గేట్లను ఎత్తిన ప్రజాప్రతినిధులు

కోనరావుపేట, ఆగస్టు 6 (విజయక్రాంతి): కోనరావుపేట మండలంలోని నిమ్మపల్లి మూలవాగు ప్రాజెక్టు(Nimmanapalli project) నుంచి కోనరావుపేట కొండ చెరువుకు నీటిని విడుదల చేసేందుకు కాలువ గేట్లను గురువారం ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో ఎత్తారు. ఇటీవల కురిసిన వర్షాలతో మూలవాగులో నీటి ప్రవాహం పెరగడంతో చెరువుకు నీటిని మళ్లించే చర్యలు చేపట్టారు.ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ, చెరువులు నిండితే భూగర్భ జలాలు పెరగడంతో పాటు రైతులకు సాగునీటి అవసరాలు తీర్చేందుకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. వర్షపు నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా నీటి నిర్వహణ చర్యలు కొనసాగిస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కోనరావుపేట సర్పంచ్ మస్కూరి కాశీరాం, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మానుక సత్యం, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు నాగరాజు, అజీమ్ పాషా, వాల్య నాయక్, ఇరిగేషన్ ఏఈ, వార్డు సభ్యుడు జింక వెంకటి, నాయకులు కమ్మరి నాగరాజు, జింక కర్ణాకర్, గంగపుత్ర సంఘం అధ్యక్షుడు కూర బాబు, సదానందం, గొట్టె రవి, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.