6 August, 2026 | 1:29 PM

ఫీజుల బకాయిలు వెంటనే విడుదల చేయాలి

06-08-2026 12:08 PM

బీజేవైఎం ఆందోళన

కోనరావుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సంతకాల సేకరణ.

కోనరావుపేట, ఆగస్టు 6 (విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు, బీజేవైఎం రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు శాఖ రాజిరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా కళాశాలలను సందర్శిస్తూ పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా కోనరావుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులతో సమావేశమైన బీజేవైఎం నాయకులు వారి సమస్యలను తెలుసుకుని "ఫీజుల బకాయి – బీజేపీ లడాయి" నినాదంతో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ సందర్భంగా బీజేవైఎం నాయకులు చల్ల జితేందర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న రూ.15,000 కోట్ల స్కాలర్షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని కొనసాగిస్తే స్థానిక ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉధృత ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు, ధర్మారం సర్పంచ్ మిర్యాల్ కార్ బాలాజీ, ప్రధాన కార్యదర్శి జలందర్, యువమోర్చా నాయకులు పొన్నం మహేష్, మెతుకు భాను, అజయ్, అభినయ్ తదితరులు పాల్గొన్నారు.