బోధన్ తహసీల్దార్ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు
06-08-2026 12:07 PM
బోధన్,ఆగస్టు 06 (విజయక్రాంతి): బోధన్ తహసీల్దార్ కార్యాలయంలో గురువారం తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బోధన్ తహసీల్దార్ పట్నం. విటల్ ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి ప్రొఫెసర్ జయశంకర్ అందించిన సిద్ధాంతపరమైన మార్గదర్శకత్వం, విద్యారంగానికి చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 6న ఆయన జయంతిని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించడం ఆయన ఆశయాలకు నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్, ఆర్‌ఐలు, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






