6 August, 2026 | 1:19 PM

బాధ్యతలు స్వీకరించిన ఇన్ఛార్జి కలెక్టర్ భవేష్ మిశ్రా

06-08-2026 12:12 PM

బోధన్ ఆగస్టు 06 (విజయ క్రాంతి): నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ గా భవేష్ మిశ్రా గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఉదయం 10.45 గంటల సమయంలో కలెక్టరేట్ చేరుకున్న ఆయనకు అధికారులు స్వాగతం పలికారు. శాఖల పనితీరుపై సమీక్ష కలెక్టరేట్ కు చేరుకున్న భవేష్ మిశ్రా నేరుగా తన ఛాంబర్ కు వెళ్లి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన అధికారులతో సమావేశమై వివిధ శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. వివరాలు తెలుసుకున్నారు. మొదటిసారిగా జిల్లాకు వచ్చిన భవేష్ మిశ్రాకు అదనపు కలెక్టర్ భుజంగరావు, ట్రైనీ కలెక్టర్ సురేష్, డీఆర్వో గీత తదితరులు సాదరంగా స్వాగతం పలికారు. పుష్పగుచ్చాలు అందజేశారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మూడు నెలల పాటు ప్రసూతి సెలవులో ఉన్నారు. ఇటీవలే ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఇన్ఛార్జి కలెక్టర్ భవేశ్ మిశ్రా ఇలా త్రిపాఠికి భర్త కావడం విశేషం. ఆయన ప్రస్తుతం నిర్మల్ జిల్లాకు కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు.